![]() |
![]() |
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో మొదటి స్థానం బ్రహ్మముడి ఉండగా.. నాల్గవ స్థానంలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉంది. ఇక ఈ కథలో రోజుకో మలుపుతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వనుంది. కృష్ణ వాళ్ళ బాబాయ్ పాత్రలో ఈ సీరియల్ నిర్మాత మలయజ ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ కథ విషయానికొస్తే.. ముకుంద, మురారి విదేశాలలో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఇండియాకి వచ్చేస్తారు. ఇక వచ్చాక కృష్ణని మురారి పెళ్లి చేసుకుంటాడు. ఆదర్శ్ ని ముకుంద పెళ్ళి చేసుకుంటుంది. ఇక ముకుంద మురారి కృష్ణ ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మురారి వాళ్ళ అమ్మ రేవతి, పెద్దమ్మ భవాని ఉంటారు. ఇక మొదటి నుండి కృష్ణ అంటే ఇష్టం లేని భవాని.. అడవి పిల్ల, తింగరి పిల్ల అని దూరంగా ఉంచుతుంది. కానీ కృష్ణ మాత్రం ఇప్పుడిప్పుడే భవానికి దగ్గరవుతుంది. ముకుంద ప్రేమించింది మురారినే అనే విషయాన్ని తెలసుకున్న కృష్ణ షాక్ అవుతుంది. అయితే మురారి మనసులో ముకుందకి స్థానం లేదని ఇప్పుడు మురారి మనసులో కృష్ణ ఉందని తెలుసుకుంటుంది కృష్ణ. ఇక దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని ముకుంద మనసు నుండి ఎలాగైనా మురారిని తీసేయాలని, ఆదర్శ్ ని తీసుకురావలని మధుతో కలిసి కృష్ణ ప్లాన్ చేస్తుంటుంది.
భవానీకి కృష్ణ వాళ్ళ బాబాయ్ పెద్దపల్లి ప్రభాకర్ గా మలయజ ప్రభాకర్ ఫోన్ చేస్తాడు. అదే విషయాన్ని కృష్ణకి భవాని చెప్తుంది. కాసేపటికి కృష్ణ వాళ్ళ బాబాయ్ లారీ వేసుకొని వచ్చేస్తాడు. లారీ హారన్ విని ఇంట్లోని వాళ్ళంతా బయటకొచ్చేస్తారు. ఇక వచ్చీ రాగానే అందరిని పలకరిస్తాడు మలయజ ప్రభాకర్. వాళ్ళ బాబాయ్ ని చూసి వెంటనే ప్రేమతో హత్తుకుంటుంది. ఏం బిడ్డ ఎట్లున్నవ్, బాగున్నవా? అంటూ కృష్ణని వాళ్ళ బాబాయ్ పెద్దపల్లి ప్రభాకర్ పలకరించాడు. ఆ తర్వాత నమస్తే అక్క అని భవానిని, అల్లుడు మంచిగున్నాడు. మా అన్నకు కొడుకు లేడని భాద ఉంటుండే, ఇప్పుడు కొడుకు లాంటి అల్లుడు వచ్చిండని ప్రభాకర్ అన్నాడు. ఇక అన్నీ బాగున్నాయి కానీ ఈ అమ్మాయేంటి ఖాళీగా ఉందని, ఈమెకి భర్త లేడా అని ముకుందని ఉద్దేశించి అన్నాడు. ఇక అందరు ఆశ్చర్యంలో ఉండిపోతారు. మరి కృష్ణ వాళ్ళ బాబాయ్ రాకతో ఈ కథ ఏ మలుపు తిరగనుందో చూడాలి మరి.
![]() |
![]() |